- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలోనే ఆదేశాలు.. జిల్లా కలెక్టర్‌గా సీహెచ్ శివలింగయ్య
<p>దిశ, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్‌గా బుధవారం సీహెచ్ శివలింగయ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. ఈ క్రమంలో జిల్లా రోడ్డు రహదారి భవనాల శాఖ అధికారులు కలెక్టర్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాకు స్వాగత బోర్డులు ఎక్కడా కనిపించలేదు ఎందుకని, పోలీస్ శాఖ నుంచి స్వాగతం బోర్డు మాత్రమే కనిపించాయని ఆర్అండ్‌బీ, ఎన్‌హెచ్ఐ నుంచి స్వాగత బోర్డులు ఎందుకు లేవని అధికారులను ప్రశ్నించారు. వెంటనే జిల్లా ప్రారంభ, స్వాగత బోర్డులు ఏర్పాటు […]</p>

దిశ, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్‌గా బుధవారం సీహెచ్ శివలింగయ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. ఈ క్రమంలో జిల్లా రోడ్డు రహదారి భవనాల శాఖ అధికారులు కలెక్టర్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాకు స్వాగత బోర్డులు ఎక్కడా కనిపించలేదు ఎందుకని, పోలీస్ శాఖ నుంచి స్వాగతం బోర్డు మాత్రమే కనిపించాయని ఆర్అండ్‌బీ, ఎన్‌హెచ్ఐ నుంచి స్వాగత బోర్డులు ఎందుకు లేవని అధికారులను ప్రశ్నించారు. వెంటనే జిల్లా ప్రారంభ, స్వాగత బోర్డులు ఏర్పాటు చేయాలని ఆ శాఖను ఆదేశించారు.
అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి చేసుకుందాం..

అందరి సహకారంతో జనగామ జిల్లాను అభివృద్ధి చేసుకుందామని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ శివలింగయ్య జనగామ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అందరి సహకారంతో సమన్వయంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని, అందుకు ప్రజలు అందరూ సహకరించాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.






