- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేశ్వరం మార్కెట్లో మౌలిక సదుపాయాలు: సబితా
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: మహేశ్వరం మార్కెట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని మంత్రి కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 9.28 ఎకరాలలో మార్కెట్ కార్యాలయం, రెండు షెడ్లు, గోదాంలు, రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముకునే స్టాళ్లు, తాగునీరు, మరుగుదొడ్డు నిర్మించాలని సూచించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా నెలకొల్పాలని చెప్పారు. సుమారు రూ. […]</p>

X
దిశ, రంగారెడ్డి: మహేశ్వరం మార్కెట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని మంత్రి కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 9.28 ఎకరాలలో మార్కెట్ కార్యాలయం, రెండు షెడ్లు, గోదాంలు, రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముకునే స్టాళ్లు, తాగునీరు, మరుగుదొడ్డు నిర్మించాలని సూచించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా నెలకొల్పాలని చెప్పారు. సుమారు రూ. 2 కోట్ల నిధులతో పనులు ప్రారంభించాలన్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
Next Story






