ఇన్ఫోసిస్ త్రైమాసిక లాభంలో 21 శాతం వృద్ధి

by  |
ఇన్ఫోసిస్ త్రైమాసిక లాభంలో 21 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం 20.5 శాతం వృద్ధితో రూ. 4,845 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,019 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 8.6 శాతం పెరిగి రూ. 24,570 కోట్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 22,629 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఇన్ఫోసిస్ బోర్డు ఈక్విటీ షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం, మార్జిన్ పెరిగిన నేపథ్యంలో క్లయింట్లకు సంస్థ పట్ల కొనసాగుతున్న నమ్మకాన్ని సూచిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ చెప్పారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో ద్రవ్యత గణనీయంగా పెరిగిందని, నగదు నిర్వహణపై సంస్థ దృష్టి సారించడం ద్వారా కంపెనీ లాభాలు, ఆదాయం పెరిగాయని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రతి షేర్‌కు మధ్యంతర డివిడెండ్‌ను 50 శాతం పెంచి రూ. 12గా నిర్ణయించినట్టు ఆయన వివరించారు.

వ్యయ నియంత్రణ, కార్యాచరణ సామర్థ్యాలను బలోపేత చేయడంలో కఠిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి సగం కంపెనీ మార్జిన్లు 25.4 శాతానికి మెరుగుపడటానికి దోగదం చేశాయని నీలాంజర్ తెలిపార్. ‘ఇన్ఫోసిస్ సంస్థకున్న బలం రెండో త్రైమాసికంలో స్పష్టంగా కనబడిందని, నిర్వహణలో ఆరోగ్యకరమైన పెరుగుదల, విస్తృతమైన వృద్ధి లాంటి పరిణామాలు భవిష్యత్తుపై ఆశాజనక సంకేతాలను ఇస్తున్నాయని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు చెప్పారు. ముఖ్యంగా సంస్థ విజయానికి ఉద్యోగులు కీలకమని చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని అత్యుత్తమ పనితీరును వారు కనబరిచారని, రెండో త్రైమాసిక ఫలితాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని స్థాయిలలో ఉన్న ఉద్యోగులకు వేతన పెంపు, పదోన్నతులు ఇవ్వనున్నట్టు ప్రవీణ్ రావు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed