పసికందు మృతి.. వ్యాక్సినే కారణమని ANMపై దాడి

by  |
ANM
X

దిశ, సదాశివనగర్: కరోనా వ్యాక్సిన్ వల్లే పసికందు మరణించిందని కుటుంబసభ్యులు, బంధువులు ఏఎన్ఎంపై దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉట్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామానికి చెందిన వడ్డే శ్రీలత(గర్భిణి)కు ఈనెల 1వ తేదీన ఏఎన్ఎం సావిత్ర ఫస్ట్‌డోస్ కొవిడ్ వ్యాక్సిన్(కోవిషీల్డ్‌) ఇచ్చారు. అనంతరం నవంబర్ 2వ తేదీన పురిటి నొప్పులు రావడంతో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించారు.

అయితే, పుట్టిన బిడ్డ ప్రమాదకరంగా ఉండటంతో హుటిహుటిన కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అటునుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయినా, ఫలితం లేకుండా పరిస్థితి విషమించి నవంబర్ 4వ తేదీన శిశువు మరణించింది. దీంతో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగానే తమ శిశువు మరణించిందని, ఆమెకు వ్యాక్సిన్ వేసిన ఏఎన్ఎం సావిత్రిపై కుటుంబసభ్యులు, బంధువులు దాడిచేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి ఏఎన్ఎమ్‌లు దాడిని నిరసిస్తూ.. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.


Next Story

Most Viewed