డీలాపడిన సేవల రంగం కార్యకలాపాలు

by  |
డీలాపడిన సేవల రంగం కార్యకలాపాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా ప్రభావం తిరిగి పెరుగుతుండటంతో మార్చి నెలకు సంబంధించి సేవల రంగం కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. మార్చి నెల సేవల రంగం పీఎంఐ 54.6కి తగ్గినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక తెలిపింది. కరోనా వ్యాప్తి మళ్లీ పెరగడంతో దేశ సేవల రంగంపై తీవ్రమైన ప్రభావం ఉందని, ఫిబ్రవరిలో 55.3 శాతంగా పీఎంఐ నమోదైనట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ పేర్కొంది. అయితే, వరుసగా ఆరో నెలలో కూడా సేవల రంగ పీఎంఐ సానుకూల వృద్ధిని నమోదు చేసింది.

సాధారణంగా పీఎంఐ సూచీ 50 పాయింట్లకు ఎగువన ఉంటే సానుకూల వృద్ధిని సాధించినట్టుగా పరిగణిస్తారు. దానికి దిగువన నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు. ఇటీవల కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడం, పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షల వల్ల ఏప్రిల్ నెలలోనూ సేవల రంగం మరింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ అభిప్రాయపడింది. గతవారం తయారీ రంగం పీఎంఐ సూచీ కూడా 57.3 నుంచి 56కు తగ్గిన సంగతి తెలిసిందే. ‘కరోనా నుంచి కోలుకుని డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకుంటున్న సమయంలో కరోనా మళ్లీ వినియోగదారుల్లో ఆందోళనను పెంచిందని’ ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్ అసోసియేట్ డైరెక్టర్ డిలిమా చెప్పారు.


Next Story

Most Viewed