- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షీణించిన సేవల ఎగుమతులు
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన సంగతి తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థ కూడా ఎగుమతుల పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అతిపెద్ద సంక్షోభం తర్వాత నిలదొక్కుకుంటున్న భారత్ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో దేశీయ సేవల ఎగుమతులు క్షీణించాయి. సెప్టెంబర్‌లో భారత సేవల ఎగుమతులు 1.4 శాతం తగ్గి సుమారు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఇటీవల ఆర్‌బీఐ డేటా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు సుమారు రూ. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన సంగతి తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థ కూడా ఎగుమతుల పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అతిపెద్ద సంక్షోభం తర్వాత నిలదొక్కుకుంటున్న భారత్ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో దేశీయ సేవల ఎగుమతులు క్షీణించాయి.
సెప్టెంబర్‌లో భారత సేవల ఎగుమతులు 1.4 శాతం తగ్గి సుమారు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఇటీవల ఆర్‌బీఐ డేటా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు సుమారు రూ. 1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులతో పాటు సేవల దిగుమతులు (లేదా చెల్లింపులు) కూడా తగ్గాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి 8.7 శాతం తగ్గి సుమారు రూ. 75 వేల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో సేవల దిగుమతులు సుమారు రూ. 82 వేల కోట్లుగా నమోదయ్యాయని ఆర్‌బీఐ డేటా స్పష్టం చేసింది.
Next Story






