ఏప్రిల్‌లో 99.9 శాతం పడిపోయిన బంగారం దిగుమతులు!

by  |
ఏప్రిల్‌లో 99.9 శాతం పడిపోయిన బంగారం దిగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో పసిడికి అత్యధిక డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. అందుకే డిమాండ్ కొరత లేకుండా విదేశాల నుంచి బంగారం దిగుమతి జరుగుతూ ఉంటుంది. అలాంటి మన దేశంలో ఏప్రిల్ నెలకు బంగారం దిగుమతులు 99.9 శాతం పడిపోయాయి. దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటం, జ్యువెలరీ దుకాణాలు మూతబడటంతో పాటు, విదేశాల నుంచి ఎటువంటి రవాణా లేకపోవడం వంటి కీలక కారణాలతో బంగారం దిగుమతులు ఇంతలా దిగజారాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో దిగుమతులు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.

ఏప్రిల్ నెలకు గాను, ఇండియా పసిడి దిగుమతి చేసుకున్నది కేవలం 50 కిలోలు. 2019 ఏప్రిల్‌లో ఇండియా దిగుమతి చేసుకున్న బంగారం మొత్తం 110.18 టన్నులు. కరెన్సీ విలువలో పరిశీలిస్తే..2019 ఏప్రిల్‌లో దిగుమతి అయిన బంగారం విలువ రూ. 30,019 కోట్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం రూ. 21 కోట్లు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 43,760 ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 46,560 ఉంది.

Tags : Commodities, Gold, India, gold import in india



Next Story