- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హలో జర్నలిస్ట్.. ఛలో ప్యారడైస్
<p>దిశ, జవహర్ నగర్: దేశ వ్యాప్తంగా సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. ఈమేరకు గురువారం దిశ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ […]</p>

దిశ, జవహర్ నగర్: దేశ వ్యాప్తంగా సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. ఈమేరకు గురువారం దిశ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో గాంధీ విగ్రహాల ముందు నిరసనలు చేపట్టాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.
కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా వందలాది మంది జర్నలిస్టులు నేలకొరిగినా, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్టుల ప్రాణాలకు పాలకులు భరోసా ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వార్తలు రాస్తున్న పాత్రికేయులపై, మీడియా సంస్థలపై, పౌర హక్కుల కార్యకర్తలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్లలో బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతా, ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపై అక్టోబర్ 2న, ఉదయం 10.30గం.లకు సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని గాంధీ విగ్రహం ముందు టీయూడబ్ల్యూజే ఆందోళన చేపట్టి మహాత్మాగాంధీకి వినతిపత్రాన్ని సమర్పించనున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టు మిత్రులు భారీగా తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు.






