ఇండియన్ ఐడల్ 12 టైటిల్ విన్నర్ అతడే.. లీకైన పిక్స్!

by  |
singer-15-08-2021
X

దిశ, సినిమా : పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ 12’ ట్రోఫీని సింగర్ పవన్‌దీప్ రాజన్ సొంతం చేసుకున్నాడా? ఈ గ్రాండ్ ఫినాలేకు సంబంధించి లీకైన పిక్చర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. పవన్‌దీప్ చేతిలో టైటిల్ ట్రోఫీ, రూ.25 లక్షల చెక్ పట్టుకుని ఉండటం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన పవన్‌దీప్ ఇండియన్ ఐడల్ 12 టైటిల్ గెలుచుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తనకు ప్రైజ్ మనీతో పాటు ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌లో పాట పాడే అవకాశం కూడా లభించనుంది. అంతేకాదు అశీష్ కులకర్ణితో పాటు టీ-సిరీస్ ఆడియో కంపెనీకి కంపోజర్‌గా పనిచేసే అవకాశాన్నీ దక్కించుకున్నాడని గెస్ట్‌గా వచ్చిన లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ వెల్లడించారు.

ఇక సీజన్ 12 మొదటిరోజు నుంచే జడ్జిలను తన పర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేసిన పవన్‌దీప్.. పియానో, గిటార్ ప్లే చేస్తూ కూడా పాడగలడు. ఉత్తరాఖండ్, కుమాఉన్ యూనివర్సిటీ నుంచి మ్యూజిక్ డిగ్రీ పొందిన పవన్‌దీప్‌కు చండీగఢ్‌లో ఓ బ్యాండ్ కూడా ఉంది. ఇక ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలేలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు పార్టిసిపేట్ చేయగా.. జావేద్ అలీ, మనోజ్ ముంతాషిర్, మిల్కా సింగ్, సుఖ్విందర్ సింగ్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. కాగా ఎన్నో ఆశలతో ఫైనల్స్‌లో పాల్గొన్న తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియ టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది.



Next Story

Most Viewed