అదీ క్రికెటేనా.. మానేయడమే మంచిది : ద్రవిడ్

by  |
అదీ క్రికెటేనా.. మానేయడమే మంచిది : ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా నేపథ్యంలో స్తంభించిన క్రికెట్‌ను పునఃప్రారంభించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పలు ప్రత్యామ్నాయాలు చేస్తోంది. ఇంగ్లాండ్‌లో జరగబోతున్న వెస్టిండీస్, పాకిస్తాన్ సిరీసుల్లో పాటించనున్న నిబంధనలను ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ఇప్పటికే వెలువరించింది. కాగా, ఈ నియమాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీబీ సూచనల మేరకు ఇంగ్లాండ్ జట్టు తమ మ్యాచ్‌లు అన్నింటినీ బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించబోతోంది. ప్రతి క్రీడాకారుడికి ఒక రక్షణ వలయం ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఈ విషయమై ద్రవిడ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈసీబీ సూచించిన వాతావరణంలో క్రికెట్‌ ఆడలేమని చెప్పాడు. అలాంటి వాతావరణంలో ఆడటం కంటే మానేయడమే మంచిదన్నాడు. ఓ క్రీడాకారుడి వెంట రక్షణ వలయం సృష్టించడం అనేది ఒక మిథ్య అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెటర్లను పరీక్షించి బరిలోకి దింపిన తర్వాత రెండోరోజు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఏం చేయాలని ఆయన ప్రశ్నించాడు. ప్రస్తుతమున్న నిబంధనల మేరకు అందరు క్రికెటర్లను, అంపైర్లను క్వారంటైన్‌లో ఉంచాలి కదా? మూడోరోజు ఎవరు ఆడతారని ద్రవిడ్ ప్రశ్నించాడు. రాబోయే రెండేండ్ల వరకు టెస్టు మ్యాచ్‌లను రద్దు చేయడమే మంచిదని, లేకపోతే అనవసరంగా క్రికెట్ బోర్డులు నష్టాలను చవిచూడాల్సి వస్తుందని చెప్పాడు. రాబోయే రాజుల్లో ప్రొఫెషనల్ క్రికెటర్లు చాలా విషయాలను అలవాటు చేసుకోవాలని, గతంలో మాదిరిగా భవిష్యత్ ఉండదని ఆయన సూచిస్తున్నారు.

Next Story

Most Viewed