అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్ బై

by  |
అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్ బై
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS DHONI) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)కు ముందు అభిమానులకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ (International cricket) నుంచి తాను రిటైర్ (Retired) అవుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఈ వార్త విన్న అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మిస్టర్ కూల్.. కూల్ గానే రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడం గమనార్హం.

జార్ఖండ్ రాజధాని రాంచీ (Ranchi)లో పుట్టిన ధోనీ 2004లో భారత జాతీయ జట్టు (Indian national team) లో చోటు దక్కించుకున్నాడు. 23 డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్ జట్టుతో వన్డే (One Day)ల్లో అరగేట్రం చేయగా, 2 డిసెంబర్ 2005లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టు (Test Match)ల్లోకి అడుగుపెట్టాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. ఎంతో మంది యువక్రికెటర్ల (young cricketers)ను పరిచయం చేశాడు.

ఇక, మూడు ఐసీసీ టైటిల్స్ (వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) (Icc ODI World Cup, T20 World Cup, Champions Trophy) సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీకి రికార్డు ఉంది. 28 ఏళ్ల తర్వాత భారత జట్టు రెండో సారి ప్రపంచ కప్ గెలవడంలో ధోనీదే కీలక పాత్ర. గత ఏడాది చివరి సారిగా 9 జులై 2019న వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత పలు మార్లు ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు వచ్చినా అతను స్పందించలేదు.

ఐపీఎల్‌లో రాణించిన తర్వాత టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) జట్టులో స్థానం సంపాదిస్తాడని అందరూ భావించారు. 26 డిసెంబర్ 2014న ధోనీ టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. అప్పటి నుంచి కేవలం వన్డేలు, టీ20లకే పరిమితం అయ్యాడు. మరి కొన్ని రోజుల్లో యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ఆడటానికి చెన్నై చేరుకున్న ధోనీ.. అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు (international cricket) రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ధోనీ తన కెరీరో‌లో మొత్తం 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ ఖాతాలో 9 టెస్టు సెంచరీలు, 10 వన్డే సెంచరీలు చేశాడు.

Next Story

Most Viewed