ఇండియాలోనే ఏఎఫ్‌సీ మహిళల ఏషియన్ కప్ 2022

by  |
ఇండియాలోనే ఏఎఫ్‌సీ మహిళల ఏషియన్ కప్ 2022
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో ఇటీవల కాలంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్న క్రమంలో మహిళల జట్లను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో రెండు మెగా ఈవెంట్లను ఇక్కడ నిర్వహించేందుకు నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) మహిళల ఏసియన్ కప్ 2022, ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ 2022 నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మెగా ఈవెంట్లు జరగడానికి ముందే ఏఎఫ్‌సీ మహిళల క్లబ్ చాంపియన్‌షిప్ 2021 పైలట్ టోర్నీలో ఇండియాకు చెందిన క్లబ్‌ను ఆడించనున్నారు. ఇప్పటి వరకు పురుషుల క్లబ్స్ మాత్రమే ఏఎఫ్‌సీ క్లబ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాయి. కానీ తొలిసారి ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు ఎనిమిది దేశాలకు చెందిన క్లబ్స్‌తో నిర్వహించనున్న టోర్నీలో భారత మహిళా ఫుట్‌బాల్ క్లబ్ కూడా పోటీ పడనున్నది. ఇండియాను గ్రూప్ బీలో చేర్చారు. ఇందులో ఇండియాతో పాటు ఇరాన్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన క్లబ్స్ ఉన్నాయి. ఇండియన్ ఉమెన్స్ లీగ్ చాంపియన్ ఈ టోర్నీలో పాల్గొననున్నది.


Next Story

Most Viewed