సరిహద్దులకు చేరుకోవడానికి కొత్త మార్గాలు..

by  |
సరిహద్దులకు చేరుకోవడానికి కొత్త మార్గాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ సరిహద్దులకు సులువుగా చేరుకునేందుకు భారత ప్రభుత్వం కొత్త మార్గాలను సిద్దం చేస్తోంది. యుద్ధం సమయంలో అతి తక్కువ సమయంలో శత్రువుల కల్లుగప్పి యుద్ధ సామగ్రిని కదన రంగానికి తరలించేందుకు ఈ మార్గాలు దోహదం చేస్తాయని ప్రభుత్వవర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలోనే హిమాచల్‌లోని మనాలి నుంచి లఢక్‌లో పాకిస్తాన్, చైనా సరిహద్దులకు చేరుకునేందుకు భారత్ ఆర్మీ కొత్తగా ఓ రోడ్డు నిర్మిస్తోంది. దీనిద్వారా దేశ వ్యతిరేక శక్తుల కంట పడకుండా బలగాలను, యుద్ధ ట్యాంకర్లను బోర్డర్లకు చేర్చే అవకాశం ఉంటుంది. సరిహద్దుల్లో ఇతర సున్నిత ప్రాంతాలకు కూడా కొత్త రోడ్లను నిర్మించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. కాగా, గతేడాది శ్రీనగర్ రహదారి మీదుగా బలగాలను తరలిస్తుండగా పుల్వామా ఉగ్రదాడి జరిగి 40మందికి పైగా భద్రత బలగాలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed