- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Facebook ఓపెన్ చేస్తే అమ్మాయి చెంపదెబ్బ.. 98శాతం పెరిగిన ఉత్పత్తి
<p>దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా జనాలపై చాలా ఎఫెక్ట్ చూపుతోంది. పనికొచ్చే పనులు పక్కనపెట్టేసి 24 గంటలూ దాని ధ్యాసలోనే ఉండేలా చేస్తోంది. పవ్‌లోక్ MNC కంపెనీ సీఈఓ మనీష్ సేథీకి సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఫేస్‌బుక్ వల్లే తన ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని రియలైజ్ అయిన మిస్టర్ సేథీ.. FB ఓపెన్ చేసినప్పుడల్లా తన చెంపపై కొట్టి అలర్ట్ చేసేందుకు 2012లో కర అనే అమ్మాయిని నియమించుకున్నాడు. ఇందుకోసం గంటకు ఎనిమిది డాలర్లు […]</p>

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా జనాలపై చాలా ఎఫెక్ట్ చూపుతోంది. పనికొచ్చే పనులు పక్కనపెట్టేసి 24 గంటలూ దాని ధ్యాసలోనే ఉండేలా చేస్తోంది. పవ్‌లోక్ MNC కంపెనీ సీఈఓ మనీష్ సేథీకి సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఫేస్‌బుక్ వల్లే తన ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని రియలైజ్ అయిన మిస్టర్ సేథీ.. FB ఓపెన్ చేసినప్పుడల్లా తన చెంపపై కొట్టి అలర్ట్ చేసేందుకు 2012లో కర అనే అమ్మాయిని నియమించుకున్నాడు. ఇందుకోసం గంటకు ఎనిమిది డాలర్లు చెల్లిస్తున్నాడు. ఈ దెబ్బకు తన ప్రొడక్టివిటీ ఒక్కసారిగా 98శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని మిస్టర్ సేథీ తన బ్లాగ్‌లో వివరించగా.. చెంప దెబ్బకు సంబంధించిన పిక్, స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా దీనిపై వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, టెస్లా అండ్ స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ స్పందించాడు. ఈ ఐడియాకు రెండు ఫైర్ ఎమోజీస్ ఇస్తూ మిస్టర్ సేథీని అభినందించాడు. దీంతో ఆనందపడిపోయిన సేథీ.. ‘ఎలన్ మస్క్ నాకు రెండు ఎమోజీలు ఇస్తున్నారా? నేను అందుకోలేనంత ఎత్తుకు ఎదిగానా? ఐకారస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఎగురుతున్న క్షణాన్ని సూచించడానికి ఉద్దేశించబడిందా? అని ఆశ్చర్యపోయాడు.
పనిగంటలు ముగిశాక బాస్ మెసేజ్ చేస్తే.. ఇకపై ఇల్లీగల్!
The story of Maneesh Sethi, the computer programmer who hired a woman to slap him in the face every time he used Facebook, resulting in massive productivity increase [read more: https://t.co/Q5fKjYtFSo] pic.twitter.com/d8pnt3Jd8k
— Massimo (@Rainmaker1973) November 10, 2021






