ఇండియా – ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ విడుదల

by  |
ఇండియా – ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ విడుదల
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. కోవిడ్ నేపథ్యంలో వన్డే, టీ20లను కేవలం రెండు స్టేడియంలకే పరిమితం చేయగా.. నాలుగు టెస్టులకు మాత్రం వేర్వేరు వేదికలు సిద్దం చేశారు. డిసెంబర్ 17నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అడిలైడ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డే అండ్ నైట్ ఫార్మాట్‌లో పింక్ బాల్ టెస్టు నిర్వహించనున్నారు. ఐపీఎల్ అనంతరం టీమ్ ఇండియా యూఏఈ నుంచి నేరుగా సిడ్నీ పయనం కానుంది.

పూర్తి షెడ్యూల్..

తొలి వన్డే : నవంబర్ 27 – సిడ్ని
రెండో వన్డే : నవంబర్ 29 – సిడ్ని
మూడో వన్డే : డిసెంబర్ 2 – కాన్‌బెర్రా

తొలి టీ20 : డిసెంబర్ 4 – కాన్‌బెర్రా
రెండో టీ20 : డిసెంబర్ 6 – సిడ్ని
మూడో టీ20 : డిసెంబర్ 8 – సిడ్ని

తొలి టెస్టు : డిసెంబర్ 17 నుంచి 21 – అడిలైడ్ ఓవల్ (డేనైట్)
రెండో టెస్టు : డిసెంబర్ 26 నుంచి 30 – మెల్‌బోర్న్ (బాక్సింగ్ డే టెస్టు)
మూడో టెస్టు : జనవరి 7 నుంచి 11 – సిడ్ని
నాలుగో టెస్టు : జనవరి 15 నుంచి 19 – గబ్బా


Next Story