- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్ భూభాగమే
<p> మలేషియా, పాకిస్థాన్ ప్రధానుల సంయుక్త సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ అనేది ఎప్పటికీ భారత్‌లో శాశ్వతమైన భూభాగమని పునరుద్ఘాటించింది. గురువారం విదేశాంగ వ్యవహార అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థాన్ మూల కేంద్రం. ఆ దేశం ఉగ్రవాదులను నియమించుకుంటోంది. శిక్షణ ఇస్తోంది. ఆయుధాలను సమకూరుస్తోంది. ఆర్థిక సాయం అందించి భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఉగ్రవాదులను సరిహద్దులను దాటిస్తోంది. మేం […]</p>

మలేషియా, పాకిస్థాన్ ప్రధానుల సంయుక్త సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ అనేది ఎప్పటికీ భారత్‌లో శాశ్వతమైన భూభాగమని పునరుద్ఘాటించింది. గురువారం విదేశాంగ వ్యవహార అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థాన్ మూల కేంద్రం. ఆ దేశం ఉగ్రవాదులను నియమించుకుంటోంది. శిక్షణ ఇస్తోంది. ఆయుధాలను సమకూరుస్తోంది. ఆర్థిక సాయం అందించి భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఉగ్రవాదులను సరిహద్దులను దాటిస్తోంది. మేం మళ్లీ ఒక్కసారి మలేషియా దేశ నాయకత్వాన్ని నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలని కోరుతున్నాం’ అని అన్నారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మలేషియాలో పర్యటించారు. తన పర్యటనను ముగించుకుని వెళ్లే సమయంలో ఇరుదేశాల ప్రధానుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఇందులో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.






