భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందాలపై పరస్పర అంగీకారం

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: తొలిసారిగా ఇరు దేశాల మధ్య 2+2 సమావేశాల్లో భాగంగా భారత్, రష్యా రక్షణ మంత్రులు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం ఉదయం జరిగిన సదస్సులో రెండు ముఖ్యమైన ఒప్పందాలు చేసినట్లు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఉమ్మడి భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఆరు లక్షల ఏకే-203 రైఫిల్స్ తయారీకి ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ రూ.5000 కోట్లని తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య మిలిటరీ సాంకేతిక [&hellip;]</p>

rajnath sing
X

న్యూఢిల్లీ: తొలిసారిగా ఇరు దేశాల మధ్య 2+2 సమావేశాల్లో భాగంగా భారత్, రష్యా రక్షణ మంత్రులు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం ఉదయం జరిగిన సదస్సులో రెండు ముఖ్యమైన ఒప్పందాలు చేసినట్లు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఉమ్మడి భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఆరు లక్షల ఏకే-203 రైఫిల్స్ తయారీకి ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ రూ.5000 కోట్లని తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య మిలిటరీ సాంకేతిక సహకారాన్ని మరో 10 ఏళ్లు పొడిగింపుకు పరస్పర అంగీకారంతో సంతకం చేసినట్లు చెప్పారు.

రక్షణ మంత్రి సెర్గీ షోయిగు రక్షణ సహకారంలో ఉత్పాదక, ఫలప్రదమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘రష్యా బలమైన సహకారాన్ని భారత్ అభినందింస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు మా సహకారంతో తీసుకువస్తుందని నమ్మకంగా ఉన్నాం’ అని మరో ట్వీట్ చేశారు. కాగా రష్యాతో తొలిసారి 2+2 సమావేశం ఇదే కావడం విశేషం. ఇంతకుముందు యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతోనే ఈ తరహా చర్చలు జరిగాయి.

Next Story