- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..
<p>న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగుతున్నది. గురువారం 3 లక్షల మార్కును దాటిని కొవిడ్ కేసులు.. అదే ఉధృతిని కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,32,730 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం దేశంలో 3.17 లక్షల కేసులు నమోదైన విషయం విదితమే. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.62 కోట్లకు (1,62,63,695) చేరింది. […]</p>

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగుతున్నది. గురువారం 3 లక్షల మార్కును దాటిని కొవిడ్ కేసులు.. అదే ఉధృతిని కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,32,730 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం దేశంలో 3.17 లక్షల కేసులు నమోదైన విషయం విదితమే.
కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.62 కోట్లకు (1,62,63,695) చేరింది. మరణాలు 2 లక్షలకు చేరువలో (1,86,920) ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 24,28,616 కి పెరిగింది. ఇదిలాఉండగా, దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నాటికి దేశంలో 13,54,78,420 మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులలో.. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచే 54.15 శాతం కేసులున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 20.04 శాతం (67,013) కేసులుండటం గమనార్హం. మరణాలు మహారాష్ట్ర (568), ఢిల్లీ (306)లో అధికంగా ఉన్నాయి.






