బడ్జెట్‌లో ఆ చర్యలుండాలి : దేశీయ కంపెనీలు

by  |
బడ్జెట్‌లో ఆ చర్యలుండాలి : దేశీయ కంపెనీలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మౌలిక సదుపాయాలు, సామాజిక రంగంలో పెరుగుతున్న వ్యయంతో పాటు డిమాండ్ పుంజుకునే చర్యలతో 2021-22 బడ్జెట్ ఉంటుందని భారత కంపెనీలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. పరిశోధనా, అభివృద్ధి(ఆర్అండ్‌డీ)ని ప్రోత్సాహం, కొత్త సాంకేతికతను ప్రోత్సహించే సమయంలో ఉత్పాదక రంగాన్ని పటిష్ఠం చేయడంపై కేంద్ర బడ్జెట్ ఉండాలని ఫికీ-ధృవ సంయుక్త నివేదిక బుధవారం అభిప్రాయపడింది.

‘వృద్ధి ఆధారిత చర్యలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధి కల్పన, వినియోగదారులకు నగదు లభ్యత వంటి వాటిపై దృష్టి ఉంచాలని, తద్వారా డిమాండ్, వృద్ధి మెరుగుపరచవచ్చని’ ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ చెప్పారు. ఈజ్ ఆఫ్ బిజినెస్‌ను మరింత సులభతరం చేయడం, పన్నుల విధానంలో సౌలభ్యం కల్పించడం వంటి చర్యలతో ప్రపంచ ఉత్పత్తి రంగంలో భారత్ కీలకనా వ్యవహరిస్తుందని, ఇది పరిశ్రమకు కీలకమని ధృవ అడ్వైజర్స్ సీఈఓ దినేష్ కుమార్ వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరచడం ద్వారా వినియోగం, పెట్టుబడుల డిమాండ్‌పై ప్రభుత్వ దృష్టి పెట్టాలని ఈ నివేదికలో అభిప్రాయం తెలిపిన 90 శాతం మంది స్పష్టం చేశారు.


Next Story