కరోనా నియంత్రణకు మూడు రోజులు బంద్

by Shyam |

<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: హోల్ సేల్ మందుల విక్రయాలకు పేరొందిన హైదరాబాద్ ఇందర్ బాగ్ వ్యాపారులు శుక్రవారం నుండి మూడు రోజుల పాటు తమ వ్యాపారాలను మూసి వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ప్రతి రోజు కరోనా కేసులు పెరిగి పోతుండడంతో శుక్రవారం ఇందర్ బాగ్ మెడికల్ ట్రేడర్స్ అసోసియేషన్ వ్యాపారులు సంఘం అధ్యక్షుడు సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ ను మూడు రోజుల పాటు [&hellip;]</p>

కరోనా నియంత్రణకు మూడు రోజులు బంద్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హోల్ సేల్ మందుల విక్రయాలకు పేరొందిన హైదరాబాద్ ఇందర్ బాగ్ వ్యాపారులు శుక్రవారం నుండి మూడు రోజుల పాటు తమ వ్యాపారాలను మూసి వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ప్రతి రోజు కరోనా కేసులు పెరిగి పోతుండడంతో శుక్రవారం ఇందర్ బాగ్ మెడికల్ ట్రేడర్స్ అసోసియేషన్ వ్యాపారులు సంఘం అధ్యక్షుడు సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ ను మూడు రోజుల పాటు మూసి వేసేందుకు నిర్ణయం తీసుకుని దుకాణాలను మూసి వేశారు. 28వ తేదీ వరకు ఎలాంటి విక్రయాలు ఉండవని, నగరం, జిల్లాల నుండి వ్యాపారులు కొనుగోలు నిమిత్తం రావద్దని ఆయన సూచించారు. అసోసియేషన్ నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైనా దుకాణాలు తెరిచి విక్రయాలు జరిపితే వారిపై అసోసియేషన్ నిబందనల మేరకు చర్యలుంటావని ఆనంద్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Next Story