- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూఇయర్ వేళ పెరగనున్న ధరలు ఇవే !
<p>దిశ, వెబ్‌డెస్క్ : నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ కొన్ని వస్తువులపై జీఎస్టీ పెంచుతూ కేంద్రం సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో కొన్ని వస్తువులపై భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంది. వస్త్ర పరిశ్రమపై ఉన్న జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే జనవరి 1 నుంచి రెడీమేడ్ దుస్తులపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఒక్క కాటన్‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ కొన్ని వస్తువులపై జీఎస్టీ పెంచుతూ కేంద్రం సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో కొన్ని వస్తువులపై భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంది. వస్త్ర పరిశ్రమపై ఉన్న జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే జనవరి 1 నుంచి రెడీమేడ్ దుస్తులపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఒక్క కాటన్‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంది. దీంతో పాటు చెప్పులపై కూడా 12 శాతం జీఎస్టీ విధించడంతో.. చెప్పులు, షూస్ ధరలు భారీగా పెరుగుతాయి. వీటితో పాటు ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో కంపెనీలకు సైతం జీఎస్టీ భారాన్ని పెంచారు. ఇకపై ప్రతి ఫుడ్ డెలివరిపై 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. గతంలో హోటళ్లు ఈ 5 శాతం జీఎస్టీని వసూలు చేయగా.. కొత్తగా ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా చేయనున్నాయి.
Next Story






