‘ఏకాంతవేళ' ఏం జరిగింది?

by  |
‘ఏకాంతవేళ ఏం జరిగింది?
X

దిశ, వెబ్‌డెస్క్ : నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఎలాంటి మలుపులు సంభవించాయన్న అంశంతో “ఏకాంతవేళ ” చిత్రాన్ని మలుస్తున్నారు. రామ్, జగదీష్, సంజేయ్ ఆచార్య, దివేష్ హీరోలుగా, రేఖ ఇందుకూరి, మంజీర, కిస్లే చౌదరి హీరోయిన్లుగా నటించారు. కె.జయప్రకాష్ దర్శకత్వం వహించారు. సుజాత ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుజాత ఆళ్ళ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదరప్రసాద్ మాట్లాడుతూ, “పెద్ద, చిన్న అన్న తారతమ్యం లేకుండా అన్ని సినిమాలకు మా సపోర్ట్ ఉంటుంది. చిన్న సినిమా బావుంటే దానిని పెద్ద సినిమాగా చేసే శక్తి ప్రేక్షకులకే ఉంది. చిత్ర పరిశ్రమపై అవగాహన లేకుండా కొంతమంది సినిమాలు తీసి నష్టపోయామని చెబుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పరిశ్రమలోకి వచ్చే కొత్తవాళ్లు ముందు అవగాహన ఏర్పరచుకుని సినిమాలు తీస్తే బావుంటుంది. కథను నమ్ముకుని ఈ చిత్రం తీశామని అంటున్నారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుంది అని ఆశిస్తున్నా” అని అన్నారు.

మరో అతిథి ముత్యాల రాందాస్ మాట్లాడుతూ,“ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నేనే పూర్తి సహకారాన్ని అందిస్తున్నాను. వాస్తవానికి లాక్ డౌన్ ముందే మార్చిలో ఈ చిత్రం పూర్తయింది. అప్పట్నుంచి థియేటర్ల ప్రారంభం కోసం ఈ చిత్ర నిర్మాత ఎంతో ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలలో పూర్తి స్థాయి థియేటర్లు ఏ తేదీ నుంచి తెరుస్తారో స్పష్టత రాలేదు. ఈ నెల 11న, లేదా ఈ నెల 18న ఎప్పుడు థియేటర్లు ఆరంభమైతే ఆ రోజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం” అని చెప్పారు.

చిత్ర దర్శకుడు కెజయప్రకాష్ మాట్లాడుతూ, “కేవలం ట్రైలర్ ను చూసి, ముత్యాల రాందాస్ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూడు జంటల మధ్య సాగే ప్రేమ ప్రయాణంలో ఏం జరిగింది? ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాళ్లు ఏం సాధించారు? అన్న ప్రధానాంశంతో ఈ చిత్రాన్ని మలిచాం.” అని అన్నారు.

నిర్మాతలలో ఒకరైన రాంకుమార్ మాట్లాడుతూ, “దర్శకుడు చెప్పిన కథ చాలా బాగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రాన్ని తీసేందుకు ముందుకు వచ్చాం. నేటి జనరేషన్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రమిది. మూడు జంటల లైఫ్ స్టైల్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని ఏంటో బాగా మలిచారు” అని అన్నారు.
ఈ ప్రెస్ మీట్లో నలుగురు హీరోలతో పాటు హీరోయిన్లు రేఖ, మంజీర, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ హేమకాంత్, ప్రభంజన్, ఎడిటింగ్: వెంకటేశ్వరరావు పాశం నిర్మాత: సుజాత ఆళ్ళ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె జయప్రకాష్.

Next Story

Most Viewed