- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండింగ్ కేసులు క్లియర్ చేయండి.. ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ ఆదేశం
<p>దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పెండింగ్ పోలీస్ కేసులన్నీ క్లియర్ చేయాలని ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోని పెండింగ్ కేసుల్లో నేర విచారణ మరింత వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. దీర్ఘకాలంగా […]</p>

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పెండింగ్ పోలీస్ కేసులన్నీ క్లియర్ చేయాలని ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోని పెండింగ్ కేసుల్లో నేర విచారణ మరింత వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని వెంటనే క్లియర్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు పాత కేసులపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష ఉంటుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై మరింత దృష్టి సారించి అవసమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్ రావు, బోనాల కిషన్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, వెంకట్, రంజిత్ రావు, కిరణ్, వేణు, సంజీవరావు, సతీష్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.






