తెలంగాణలో పబ్లిక్ గ్యాదరింగ్స్‌పై ఆంక్షలు విధించండి..

by  |
తెలంగాణలో పబ్లిక్ గ్యాదరింగ్స్‌పై ఆంక్షలు విధించండి..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా టెస్టులు, చర్యలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ బీస్ ప్రసాద్ నివేదిక అందజేశారు. ఈ నెల 7, 11వ తేదీలో 20వేల లోపు టెస్టులు చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏజీ మాట్లాడుతూ.. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉన్నారని కోర్టుకు తెలిపారు.

అయితే రాష్ట్రంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలిపింది. అంత్యక్రియలు, పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు 100 మందికి మించరాదని కోర్టు పేర్కొంది. రద్దీ ప్రాంతాలు, స్కూళ్ల దగ్గర టెస్టులు పెంచాలని తెలిపింది. ర్యాపిడ్ టెస్టుల కంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని ఆదేశించింది. కేంద్రం విడుదల చేసిన ఎస్‌వోపీ పాటించాలని కోర్టు పేర్కొంది. అదనపు వివరాలతో రిపోర్టులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి.. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

Next Story

Most Viewed