భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : కేరళలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు కేరళలోని వివిధ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. పతీనిపట్నం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్.. తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకులం, త్రిసూర్, మల్లాపూరం జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ విధించింది. [&hellip;]</p>

heavy rains
X

దిశ, వెబ్‌డెస్క్ : కేరళలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు కేరళలోని వివిధ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.

పతీనిపట్నం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్.. తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకులం, త్రిసూర్, మల్లాపూరం జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ విధించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story