లంచం ఇస్తే గుట్ట భూముల్లో అక్రమ పట్టా

by  |
లంచం ఇస్తే గుట్ట భూముల్లో అక్రమ పట్టా
X

దిశ, వేములవాడ: సొంత భూమిని పట్టా చేయాలని చుట్టూ ప్రదక్షిణలు చేసిన పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. ముడుపులు చెల్లిస్తే చాలు సర్కారు భూమిని కూడా పట్టా చేస్తారు. అలాంటి సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. మల్కపేట శివారులోని ఉండ్రూ గుట్ట సమీపంలోని సర్వే నెంబర్ 217 లో ఉన్న మూడు ఎకరాల భూమిని ఓ వ్యక్తి తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు. సాధారణంగా భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూములను ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ ఉంటుంది. అందులో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు సభ్యులుగా ఉంటారు. వీరు తుది జాబితాను సిద్ధం చేసిన తర్వాతనే పట్టా పాసు పుస్తకాలు జారీ చేస్తారు. ఇంత ప్రాసెస్ జరగాల్సి ఉండగా, ఆలాంటి ప్రక్రియ లేకుండా తహసీల్దార్ కార్యాలయంలో కొందరి సహారంతో అడ్డదారిలో పట్టా చేసుకున్నాడు సదరు వ్యక్తి. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. అక్రమ మార్గంలో వచ్చిన పట్టాను రద్దు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ గ్రామ సర్పంచ్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసి.. ఉన్నతాధికారులు అక్రమ పట్టాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోనరావుపేట మండలంలో హాట్‌ టాపిక్‌గా మారింది.


Next Story

Most Viewed