- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ileana D'Cruz :తప్పు తెలుసుకున్న ఇలియానా.. ప్చ్.. ఏం లాభం!
<p>దిశ, సినిమా : నడుము అందాలతో కనువిందు చేసి ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఇలియానా (Ileana D’Cruz).. ఆ తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. కానీ అక్కడ అంతగా అవకాశాలు అందుకోలేక, ప్రస్తుతం ఏ క్యారెక్టర్ ప్లే చేసేందుకైనా రెడీ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చలనచిత్ర పరిశ్రమను చాలా క్రూరమైన ప్రదేశంగా అభివర్ణించిన ఆమె.. ప్రజాదరణ దాన్ని సమతుల్యం చేస్తుందని […]</p>

దిశ, సినిమా : నడుము అందాలతో కనువిందు చేసి ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఇలియానా (Ileana D’Cruz).. ఆ తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. కానీ అక్కడ అంతగా అవకాశాలు అందుకోలేక, ప్రస్తుతం ఏ క్యారెక్టర్ ప్లే చేసేందుకైనా రెడీ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చలనచిత్ర పరిశ్రమను చాలా క్రూరమైన ప్రదేశంగా అభివర్ణించిన ఆమె.. ప్రజాదరణ దాన్ని సమతుల్యం చేస్తుందని అభిప్రాయపడింది. ఆర్టిస్ట్‌కు కావాల్సింది.. ప్రజలు తమను చూడటానికి ఇష్టపడటమే అని, నటనకు ప్రశంసలు దక్కని మరుక్షణం మార్క్ కోల్పోతారని తెలిపింది. పరిశ్రమ ఒక కోణంలో క్రూరంగా ఉన్నా.. ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయన్న గోవా బ్యూటీ.. నటన అనేది వృత్తి అని, అందులో లాభనష్టాలు రెండూ ఉంటాయని చెప్పింది. ‘మనం ప్రతీసారి మంచి విషయాలను మాత్రమే కనుగొనలేం.. ఒక్కోసారి కష్టాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడే లైఫ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అదే మనల్ని హార్డ్ వర్క్ చేసేలా ప్రేరేపిస్తుంది’ అని అభిప్రాయపడింది.






