- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తే నాలుక కోస్తాం’
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కుటుంబం కీలక భూమిక పోషించిందని, ఎవరైనా కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తే నాలుక కోస్తామని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ హెచ్చరించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్యాగాలు చేసిన కుటుంబంపై ఎవరైనా అవాక్కులు… చెవాక్కులు చేస్తే నాలుక కోసి చీరుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న నేతలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కుటుంబం కీలక భూమిక పోషించిందని, ఎవరైనా కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తే నాలుక కోస్తామని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ హెచ్చరించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్యాగాలు చేసిన కుటుంబంపై ఎవరైనా అవాక్కులు… చెవాక్కులు చేస్తే నాలుక కోసి చీరుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న నేతలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. కమీషన్ల కోసం టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి మధుయాష్కీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శలు చేశారు.
Next Story






