ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతే..

67

దిశ, నల్లగొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నల్లగొండ పట్టణంలోని శివాంజనేయ గార్డెన్స్‌లో ఈరోజు నిర్వహించిన పద్మనాయకా వెలమ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు.

ఎన్నిక ఏదైనా ఎగిరెది గులాబీ జెండానే అని తెలిపారు. ప్రతిపక్షాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాయని విమర్శించారు. రైల్వే స్టేషన్‌లో ఛాయ్ అమ్మానని చెపుతున్న ప్రధాని మోడీ నేడు రైళ్లను అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే మోసం, దగా, దౌర్జన్యం అని విమర్శించారు. ఆ పార్టీ నేతలకు దమ్ము, ధైర్యం లేకనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పథకాల ప్రయోజనాలపై ప్రధానిని ప్రశ్నించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందరావు, సూర్యాపేట జడ్పీ‌చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు పాల్గొన్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..