‘జల్’పడితే అంతే..

by  |
jal-pallyn
X

దిశ, జల్‌పల్లి :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు ప్రతి నెల 148 కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని, పట్ణణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల జల్‌పల్లి మున్సిపాలిటీకి 48లక్షల నిధులు మంజూరు అవుతున్నా ప్రధాన రహదారికి మాత్రం మోక్షం కలుగడం లేదు. హైదరాబాద్​ లక్ష్మీగూడ నుంచి జల్‌పల్లికి వెళ్లాలన్నా, అటు షాహిన్‌ నగర్​ నుంచి జల్‌పల్లిలోకి రావాలన్నా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చినుకు పడితే జల్‌పల్లి మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

ఇక భారీ వర్షానికి పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది. సంపన్న వర్గాలు కార్లలో మాత్రమే నీట మునిగిన రహదారులపై నుంచి వెళ్లే అవకాశం ఉంది. సామాన్యులకు, పాదాచారులకు, ద్విచక్ర వాహనాదారులకు ఆ రహదారి గుండా వెళ్లాలంటే నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. ద్విచక్రవాహనాదారులు పట్టు దప్పి చెరువులు తలపిస్తున్న రహదారి మధ్యలో ఏర్పడిన గుంతలలో పడిపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. కాగా, జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులు , మంత్రులు కూడా ఆ రహదారి గుండానే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.

కనీసం గుంతలు తేలిన రహదారులలో ప్రత్యామ్నాయ మరమ్మత్తులు కూడా చేయకుండా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్​ నాయకులు యంజాల అర్జున్​, సూరెడ్డి జంగారెడ్డిలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికయినా అధికారులు వెంటనే స్పందించి జల్‌పల్లి ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతున్నారు


Next Story

Most Viewed