- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్‌పోర్టులో కొవిడ్ రూల్స్ ఉల్లంఘిస్తే స్పాట్ ఫైన్
by Vadlamudi Anukaran |
<p>న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే స్పాట్‌లోనే ఫైన్ విధించడానికి కేంద్రం సిద్ధమైంది. కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో నిబంధనలను డీజీసీఏ కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుంటే విమానంలో నుంచైనా సదరు ప్రయాణికుడిని దింపేయాలని ఇప్పటికే తెలిపింది. తాజాగా, మరో అడ్వైజరీని విడుదల చేసింది. కొన్ని విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఒకవేళ ప్రయాణికులు నిబంధనలు పాటించకుంటే […]</p>

X
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే స్పాట్‌లోనే ఫైన్ విధించడానికి కేంద్రం సిద్ధమైంది. కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో నిబంధనలను డీజీసీఏ కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుంటే విమానంలో నుంచైనా సదరు ప్రయాణికుడిని దింపేయాలని ఇప్పటికే తెలిపింది. తాజాగా, మరో అడ్వైజరీని విడుదల చేసింది. కొన్ని విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఒకవేళ ప్రయాణికులు నిబంధనలు పాటించకుంటే చట్టానికి లోబడి స్పాట్‌లోనే జరిమానా వసూలు చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది.
Next Story






