- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దండకారణ్యంలో బాంబుల మోత
<p>దిశ, వెబ్ డెస్క్: దండకారణ్యం మరోసారి బాంబుల మోతలతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఐఈడీ పేలుడు కలకలం రేపింది. జిల్లాలోని కాలేపాల్ ఫారెస్ట్ ప్రాంతంలో జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మావోయిస్టులకు సంబంధించిన ఓ క్యాంపును ధ్వంసం చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆరు ఐఈడీ మందుపాతరలను భద్రతా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దండకారణ్యం మరోసారి బాంబుల మోతలతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఐఈడీ పేలుడు కలకలం రేపింది. జిల్లాలోని కాలేపాల్ ఫారెస్ట్ ప్రాంతంలో జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మావోయిస్టులకు సంబంధించిన ఓ క్యాంపును ధ్వంసం చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆరు ఐఈడీ మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించాయి. మర్జూమ్, కాలేపాల్ ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతుండగా.. రెండు చోట్ల మూడు ఐఈడీ మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేసినట్టు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
Next Story






