Kerala : ఆ భారీ ప్రాజెక్టు గేట్లను ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే ఎత్తారట.. ఇది నాలుగోసారి..!

by  |
Kerala : ఆ భారీ ప్రాజెక్టు గేట్లను ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే ఎత్తారట.. ఇది నాలుగోసారి..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం మొత్తం స్తంభించింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఆస్తి నష్టం ఎంతమేరకు వాటిల్లింది అనే దాని మీద ఇంకా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అన్ని జలకళను సంతరించుకున్నాయి. జలపాతాలు, వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తు్న్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

ఈ అకాల వర్షాల వలన కేరళలో ఓ అద్భుతం జరిగింది. మూడేళ్ల తర్వాత ఆ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన ఇడుక్కి డ్యాం గేట్లను అధికారులు మంగళవారం ఎత్తారు. పెరియార్ నది నుంచి వరద ఎక్కువగా వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండుకుంది. డ్యాం భద్రత దృష్ట్యా ప్రభుత్వం గేట్లను ఎత్తాలని ఆదేశించడంతో ఈరోజు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అయితే, ఈ డ్యాం నిర్మించిన నాటి నుంచి గేట్లు ఎత్తడం ఇది నాలుగోసారి అని తెలుస్తోంది. 1981,1992, 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టు అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed