తెలంగాణ క‌ళాకారులకు గుర్తింపు కార్డులు

by Vadlamudi Anukaran |

<p>దిశ, న్యూస్ బ్యూరో: క‌ళ‌ల ఖ‌జానాగా పేరొందిన తెలంగాణ‌లోని క‌ళాకారుల కోసం ప్ర‌భుత్వం గుర్తింపు కార్డులను అంద‌జేసే ప్ర‌క్రియను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) భాగ‌స్వామ్యంతో అందజేసే ఈ త‌ర‌హా గుర్తింపు కార్డులు దేశంలోనే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. `టి క‌ల్చ‌ర్` పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా క‌ళాకారులు గుర్తింపు కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ఈ యాప్‌ను శుక్రవారం [&hellip;]</p>

తెలంగాణ క‌ళాకారులకు గుర్తింపు కార్డులు
X

దిశ, న్యూస్ బ్యూరో: క‌ళ‌ల ఖ‌జానాగా పేరొందిన తెలంగాణ‌లోని క‌ళాకారుల కోసం ప్ర‌భుత్వం గుర్తింపు కార్డులను అంద‌జేసే ప్ర‌క్రియను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) భాగ‌స్వామ్యంతో అందజేసే ఈ త‌ర‌హా గుర్తింపు కార్డులు దేశంలోనే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. 'టి క‌ల్చ‌ర్' పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా క‌ళాకారులు గుర్తింపు కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ఈ యాప్‌ను శుక్రవారం ఆవిష్క‌రించారు. పౌరాణికం, ప‌ద్య‌నాట‌కం విభాగంలో మొద‌టి కార్డును మంత్రికి టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల‌ అంద‌జేశారు. ఈ యాప్ వచ్చే సోమ‌వారం నుంచి అందుబాటులో రానుంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన త‌ర్వాత క‌ళాకారులంద‌రికీ గుర్తింపు కార్డు ఇవ్వాల‌నే సంక‌ల్పం ఉంది. ఈ మేర‌కు రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సిద్ధ‌మైంది. కార్డుల జారీ ప్ర‌క్రియ‌లో మ‌ధ్య‌‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా ఉండేందుకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్త‌యేందుకు ఆన్‌లైన్ విధానంలో అందుబాటులో ప్ర‌వేశ‌పెట్టింది. తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ భాగ‌స్వామ్యంతో 'టి క‌ల్చ‌ర్‌' యాప్ రూపొందించి ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. గ్రామీణ‌ ప్రాంత క‌ళాకారులు సైతం ఈ యాప్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొని మీసేవా నుంచి కార్డు పొంద‌వ‌చ్చు. ఐడీ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత త‌గు ప్ర‌క్రియ‌లు పూర్త‌యి 30 రోజులలో ఆన్‌లైన్‌లో కార్డు రానుంది. దేశంలో‌నే మొద‌టి సారిగా తెలంగాణ క‌ళాకారుల‌కు ఈ అవ‌కాశం ద‌క్కుతోంది. క‌ళాకారుల ఐడీ కార్డుల కోసం డేటాబేస్ త‌యారీ కోసం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌ ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. ఈ డేటాబేస్ వ‌ల్ల వారంద‌రి వ‌య‌సు, జ‌న్మ‌స్థ‌లం, కళారూపం, నైపుణ్యాలు ఒక్క‌చోటే ల‌భిస్తాయి. క‌ళాకారుల‌కు ల‌భించే స్కీములు, వారికి చేకూర్చే ప్ర‌యోజ‌నాలు అందించ‌డం ప్ర‌భుత్వానికి సుల‌భం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ స్కోచ్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ప్ర‌స్తుత ప్ర‌క్రియ‌లో భాగంగా, మీసేవా కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతా‌ల్లో డిజిథాన్ వాలంటీర్లు ద్వారా త్వ‌ర‌లో మ‌రిన్ని ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేపట్టి వారికి కార్డులు అందించ‌నుంది. టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్‌ సందీప్ మ‌క్తాల నాయ‌క‌త్వంలోని ఈ ప్రాజెక్టులో టీటా ప్ర‌తినిధులు రాణాప్ర‌తాప్ బొజ్జం, శ్రీ‌కాంత్ ఉప్ప‌ల కీల‌క పాత్ర పోషించారు. ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టెక్నాల‌జీ వాడ‌కంలో ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపును పొందింద‌ని తెలిపారు. రాష్ట్ర ఐటీ రంగం స‌త్తాను చాటుతున్న మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా క‌ళాకారుల కోసం టి క‌ల్చ‌ర్ సేవ‌లు అందుబాటులోకి తెస్తున్నట్లు వివ‌రించారు. టెక్నాల‌జీ సేవ‌లు అందించిన టీటా డిజిథాన్‌ను ప్ర‌శంసించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ క‌ళాకారుల‌కు గుర్తింపు కార్డులు అందించాల‌ని దాదాపు ఏడాదిగా చేస్తున్న కృషి ఫ‌లించి టి క‌ల్చ‌ర్ యాప్ నేడు ఆవిష్క‌రించ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌న్నారు. తెలంగాణ క‌ళాకారులు ఒకే వేదిక‌గా వివిధ కార్య‌క్ర‌మాల గురించి, ప్ర‌భుత్వం యొక్క ప‌థ‌కాల గురించి తెలుసుకొని ల‌బ్ధి పొందేందుకు వీలు క‌లుగుతుంద‌ని వెల్ల‌డించారు. టీటా భాగస్వామ్యంతో రూపొందిన ఈ యాప్ సేవ‌లు మీ సేవా కేంద్రంగా ఈ నెల 27వ తేదీ నుంచి పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

Next Story