తెలంగాణలో ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సెకండ్ సర్వే

by  |
తెలంగాణలో ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సెకండ్ సర్వే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్ ఎప్పటికప్పడు తగు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే కరోనా ప్రభావంపై రెండో విడత ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ సర్వేను తెలంగాణలో ప్రారంభించింది.

రాష్ట్రంలో మొత్తం 3 జిల్లాల్లో ఈ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే ద్వారా గ్రామాల్లో కరోనా, ఎసింప్టమిక్ బాధితులను గుర్తించే అవకాశం ఉంది. అయితే, జనగామ, కామారెడ్డి, నల్గొండ.. జిల్లాల్లో మూడు రోజుల పాటు సర్వే చేస్తున్నట్లు ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రతి జిల్లాలోని 10 గ్రామాల్లో సీరం శాంపిల్స్ కూడా సేకరించనున్నారు. 10 ఏళ్లు పైబడినవారందరి నుంచి శాంపిల్స్ సేకరించనున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో కనీసం 16 ఇళ్లలో ఉన్నవారి నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించనున్నారు. ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో 15 మంది శాస్త్రవేత్తల బృందం మొత్తంగా 1200 శాంపిల్స్ కలెక్ట్ చేయనున్నారు.



Next Story