- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
champions trophy final : భారత్ ముందు టఫ్ టార్గెట్.. కివీస్ ఎంత స్కోరు చేసిందంటే?
దుబాయ్ వేదికగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది.

దిశ, స్పోర్ట్స్ : దుబాయ్ వేదికగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ను భారత బౌలర్లు మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 251 స్కోరు చేసింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ స్పిన్ మాయతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఒక దశలో కివీస్ బ్యాటర్లు సింగిల్స్ తీయడానికి కూడా తడబడ్డారు. అయితే, డారిల్ మిచెల్(63), బ్రేస్‌వెల్(53 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరి పోరాటంతో న్యూజిలాండ్‌కు పోరాడే స్కోరు దక్కింది. రచిన్ రవీంద్ర(37), గ్లెన్ పిలిప్స్(34) కూడా విలువైన రన్స్ జోడించారు. అయితే, భారత ఫీల్డింగ్ వైఫల్యమే కూడా కివీస్ పోరాడే స్కోరు చేయడానికి కారణమైంది. నాలుగు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు మిస్ చేశారు. ఇక, భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లతో రాణించారు. షమీ, జడేజాలకు చెరో వికెట్ దక్కింది. అయితే, దుబాయ్ పిచ్ మీద 252 పరుగుల లక్ష్యం టఫ్ టార్గెటే అని చెప్పుకోవాలి. అయితే, దుబాయ్ పిచ్‌పై చేజింగ్ అనుభవం భారత్‌కు కలిసిరానుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటి చేజింగ్ చేసిన భారత్ విజయతీరాలకు చేరింది. అయితే, రోహిత్, గిల్ అందించే శుభారంభంపైనే టీమిండియా ఛేదన ఆధారపడి ఉన్నది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది.






