టీమిండియా విజయం కోసం ఓ బాలుడి సాహసం.. వేడి వేడి మూకుడులో కూర్చొని..

by Ramesh Goud |   (  Updated:2025-03-09 10:24:04  IST  )

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Stadium)లో భారత్, న్యూజిలాండ్ (India Vs NewZealand) మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

టీమిండియా విజయం కోసం ఓ బాలుడి సాహసం.. వేడి వేడి మూకుడులో కూర్చొని..
X

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Stadium)లో భారత్, న్యూజిలాండ్ (India Vs NewZealand) మధ్య ఫైనల్ మ్యాచ్ (Final Match) జరుగుతోంది. ఈ ఉత్కంఠబరితమైన మ్యాచ్ లో భారత్ నెగ్గి, టైటిల్ సాధించాలని ఇండియన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గతంలో రెండు సార్లు చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే మరోసారి ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నట్లు అవుతుంది. ఈ హై హీట్ మ్యాచ్ లో ఇండియా ఎలాగైనా విజయం సాధించాలని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తమ ఇష్ట దైవాలను ప్రార్ధిస్తున్నారు.

ఇందులో కొందరు భారత ఆటగాళ్ల పేర్లపై అర్చనలు చేస్తుండగా.. మరికొందరు దేవాలయాల్లో దేవుళ్లకు ప్రత్యేక హారతులు (Special Arthi) ఇస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ అభిమాని అయిన ఓ బాలుడు చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా నెగ్గాలని వినూత్నంగా పూజలు నిర్వహించాడు. దీంతో దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట వైరల్ (Viral) గా మారింది. ఇందులో ఆ బాలుడు ఇండియా విజయం (India's Victory) కోసం పెద్ద సహసమే (adventure) చేశాడు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఓ పెద్ద మూకుడు కింద మంట పెట్టి, సల సలా కాగుతున్న నీళ్లలో కూర్చొని పూజలు చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. బిన్నంగా రిప్లై ఇస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో ప్రాథమిక సమాచారం తెలియదు కానీ, ఎంత క్రికెట్ అభిమాని అయినా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. అంతేగాక ఇది అభిమానం కాదు.. పిచ్చి అని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇంకొందరు క్రికెట్ మీద అభిమానంతో పాటు దేవుడిపై భక్తి ఉండటం అనేది ప్రత్యేకమైన విషయం అని ఆ బాలుడిని మెచ్చుకుంటున్నారు. కాగా దుబాయ్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి బౌలింగ్ కు పరిమితమైంది.

Next Story