టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన బ్రాడ్, మహ్మద్ అబ్బాస్

by  |
టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన బ్రాడ్, మహ్మద్ అబ్బాస్
X

దిశ, స్పోర్ట్స్: మాంచెస్టర్‌లో పాక్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పిన ఇద్దరు క్రికెటర్లు ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలకు చేరుకున్నారు.

అటు బౌలర్‌గా కీలక వికెట్లు తీయడమే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించిన స్టువర్ట్ బ్రాడ్ ఆల్‌రౌండర్ విభాగంలో తొలిసారి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. 220రేటింగ్ పాయింట్లతో బ్రాడ్ 10వ స్థానంలో నిలిచాడు. బెన్ స్టోక్స్ 464 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

మరోవైపు పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ కూడా మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. బౌలర్ల విభాగంలో జోష్ హాజెల్‌వుడ్‌తో కలిసి 10వ స్థానాన్ని పంచుకున్నాడు. అబ్బాస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మూడు కీలకమైన వికెట్లు తీసి ఆతిథ్య జట్టు పతనానికి కారణమయ్యాడు. ఇక పాట్ కమ్మిన్స్ ఈ విభాగంలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.


Next Story

Most Viewed