వరల్డ్ కప్‌లో పెరుగనున్న జట్ల సంఖ్య

by  |
వరల్డ్ కప్‌లో పెరుగనున్న జట్ల సంఖ్య
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్యను 10 నుంచి 14‌కు, టీ20 వరల్డ్ కప్‌లో 16 నుంచి 20కి పెంచుతూ ఎగ్జిక్యూటీవ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. మంగళవారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో 2024 నుంచి 2031 వరకు జరుగనున్న ఐసీసీ ఈవెంట్లను ఖరారు చేశారు. అంతే కాకుండా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ)కి కూడా ఆమోద ముద్ర వేశారు. 2027, 2031లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో 14 జట్లు పాల్గొననుండగా.. 2024, 2026, 2028, 2030లో జరిగే పురుషుల టీ20లో 20 జట్లను ఆడించడానికి ఐసీసీ నిర్ణయం తీసుకున్నది. జట్ల సంఖ్య పెరగడం వల్ల వన్డే వరల్డ్ కప్‌లో 54 మ్యాచ్‌లు, టీ20 వరల్డ్ కప్‌లో 55 మ్యాచ్‌లు జరుగునున్నాయి. 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ మహిళల, అండర్ 19 ఈవెంట్ల ఆతిథ్య హక్కుల కోసం ఈ ఏడాది నవంబర్‌ నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నారు.

ఏ ఏడాది ఏ ఈవెంట్…

2024 – ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్, అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్

2025 – ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, మహిళల వన్డే వరల్డ్ కప్, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్

2026 – పురుషుల టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్, అండర్-19 పురుషుల వరల్డ్ కప్

2027 – పురుషుల క్రికెట్ వర్డ్ కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, మహిళల టీ20 చాంపియన్స్ ట్రోఫీ, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్

2028 – పురుషుల టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్, అండర్-19 పురుషుల వరల్డ్ కప్

2029 – పురుషుల చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, మహిళల క్రికెట్ వరల్డ్ కప్, అండర్ – 19 మహిళల టీ20 వరల్డ్ కప్

2030 – పురుషుల టీ20 వరల్డ్ కప్, మహిళల టీ20 వరల్డ్ కప్, అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్

2031 – పురుషుల వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, మహిళల టీ20 చాంపియన్స్ ట్రోఫీ


Next Story