ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ విజేతల ప్రకటన

by Kema Shiva Kumar |

<p>దిశ, స్పోర్ట్స్: ఐసీసీ ప్రతీ నెల &#8216;ప్లేయర్స్ ఆఫ్ ది మంత్&#8217; అవార్డులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మే నెలకు సంబంధించిన అవార్డులు ప్రకటించింది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్‌కు పురుషుల విభాగంలో, స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ కాథరిన్ బ్రైస్‌కు మహిళల విభాగంలో అవార్డులు ప్రకటించారు. గత నెలలో సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ముష్ఫికర్ రహీమ్ మూడు మ్యాచ్‌లలో 237 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉన్నది. అతడు చెలరేగి [&hellip;]</p>

ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ విజేతల ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ ప్రతీ నెల ‘ప్లేయర్స్ ఆఫ్ ది మంత్’ అవార్డులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మే నెలకు సంబంధించిన అవార్డులు ప్రకటించింది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్‌కు పురుషుల విభాగంలో, స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ కాథరిన్ బ్రైస్‌కు మహిళల విభాగంలో అవార్డులు ప్రకటించారు. గత నెలలో సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ముష్ఫికర్ రహీమ్ మూడు మ్యాచ్‌లలో 237 పరుగులు చేశాడు.

ఇందులో ఒక సెంచరీ కూడా ఉన్నది. అతడు చెలరేగి ఆడటంతో శ్రీలంకపై తొలిసారి వన్డే సిరీస్ నెగ్గింది. ఇక కేథరిన్ బ్రైస్ తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో స్థానం దక్కించుకుంది. స్కాట్లాండ్ తరపున ఇంత వరకు ఏ క్రికెటర్ కూడా టాప్ 10లో చోటు సంపాదించలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఐసీసీ ఈ అవార్డు ప్రకటించింది.

Next Story