క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో ఇయాన్ హీలి!

by  |
క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో ఇయాన్ హీలి!
X

దిశ, స్పోర్ట్స్ :

ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలి త్వరలో క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో చేరనున్నారు. ప్రస్తుతం బోర్డులో ఉన్న మైఖేల్ కాస్ప్రోవిచ్ స్థానంలో హీలి బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో ఉండే 9 మంది నేషనల్ డైరెక్టర్లలో ప్రస్తుతం మైఖేల్ క్వీన్స్‌ల్యాండ్ క్రికెట్ బోర్డ్ తరపున డైరెక్టర్‌గా ఉన్నారు.

ఆయన స్థానంలో ఇప్పుడు ఇయాన్ హీలి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకుముందు హీలి క్వీన్స్‌లాండ్ స్టేట్ అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా రాజీనామా చేయనున్నారు. ‘క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నాకు ఆహ్వానం అందింది. క్వీన్స్‌లాండ్ నుంచి నన్ను నామినేట్ చేయడానికి కూడా మార్గం సుగమమం అయ్యింది. 11 ఏళ్ల పాటు బోర్డు డైరెక్టర్‌గా ఉన్న మైఖైల్ కాస్ప్రోవిచ్ తన పదవి నుంచి దిగిపోయారు. ఆయన స్థానంలో నేను బాధ్యతలు చేపట్టనున్నాను’ అని హీలి పేర్కొన్నారు.



Next Story

Most Viewed