- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IAF అధికారి ఆత్మహత్య..
<p>దిశ, వెబ్‌డెస్క్ : తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన ఓ వారెంట్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన జమ్మూలో శనివారం వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన ఈ వారెంట్ ఆఫీసర్ పేరు ఇందర్ పాల్ సింగ్ (53). జమ్ములోని కలు చాక్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడియున్న అతన్ని గమనించిన సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన ఓ వారెంట్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన జమ్మూలో శనివారం వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన ఈ వారెంట్ ఆఫీసర్ పేరు ఇందర్ పాల్ సింగ్ (53). జమ్ములోని కలు చాక్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడియున్న అతన్ని గమనించిన సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందాడని తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం, కోవిడ్-19 పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వాయుసేన అధికారులు వెల్లడించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. జమ్ము ప్రాంతంలో IAF సిబ్బంది ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండో సారి. ఈనెల 8వ తేదీన కూడా ఐఏఎఫ్ అధికారి తన సర్వీసు రైఫిల్‌తో కాల్చుకున్నాడు.






