నాకు ఈటల గతి పట్టదు : మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన కామెంట్స్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈటల రాజేందర్ బాటలోనే తెలంగాణ కేబినెట్ నుంచి త్వరలో ఎవరూ బయటకు వెళ్తారనే దానిపై గత కొద్దిరోజులుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ ట్వీట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతనిధ్యం వహిస్తున్న మంత్రి గుంతకంట్ల జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్ తరువాతి హిట్ లిస్టులో ఉన్నారని వస్తున్న కథనాలకు విద్యుత్ శాఖ మంత్రి [&hellip;]</p>

jagadeesh-reddy 1
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈటల రాజేందర్ బాటలోనే తెలంగాణ కేబినెట్ నుంచి త్వరలో ఎవరూ బయటకు వెళ్తారనే దానిపై గత కొద్దిరోజులుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ ట్వీట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతనిధ్యం వహిస్తున్న మంత్రి గుంతకంట్ల జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్ తరువాతి హిట్ లిస్టులో ఉన్నారని వస్తున్న కథనాలకు విద్యుత్ శాఖ మంత్రి ఫుల్‌స్టాప్ పెట్టారు.

తనను కేబినెట్ నుంచి తొలగిస్తారన్న ప్రచారం అంతా అవాస్తవం అని స్పష్టంచేశారు. హంపి కథంతా కొందరి స్క్రిప్ట్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. నాకు కూడా ఈటల గతి పడుతుందనేది కొందరి కల అని వివరించారు. కలలో కూడా అది జరగదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తప్పు చేశారని, అది మునిగిపోయే పడవ అని.. తెలంగాణలో ఎప్పటికైనా మునిగిపోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు.

Next Story