- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులతో పాటు నేనూ నిరాహార దీక్ష చేస్తా: కేజ్రీవాల్
by Shyam |
<p>న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంఘీభావాన్ని ప్రకటించారు. అన్నదాతలతోపాటు తాను కూడా సోమవారం నిరాహార దీక్షకు కూర్చుంటానని వెల్లడించారు. ఆప్ కార్యకర్తలు, దేశ ప్రజలూ రైతులకు సంఘీభావంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేయాలని కోరారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తూ ఢిల్లీ పొలిమేరలోని సింఘూ ప్రాంతంలో ఒకే వేదికపై రైతు సంఘాల నేతలందరూ సోమవారం నిరాహార దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 […]</p>

X
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంఘీభావాన్ని ప్రకటించారు. అన్నదాతలతోపాటు తాను కూడా సోమవారం నిరాహార దీక్షకు కూర్చుంటానని వెల్లడించారు. ఆప్ కార్యకర్తలు, దేశ ప్రజలూ రైతులకు సంఘీభావంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేయాలని కోరారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తూ ఢిల్లీ పొలిమేరలోని సింఘూ ప్రాంతంలో ఒకే వేదికపై రైతు సంఘాల నేతలందరూ సోమవారం నిరాహార దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వారు నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం ఈ ప్రకటన చేశారు.
Next Story






