- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్నుదారుణంగా మోసం చేశారు.. దుల్కర్ సల్మాన్ ఆ పాత్రకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే.. మమ్ముట్టి షాకింగ్ కామెంట్స్!
నన్ను ఒక రకంగా మోసం చేసి ఆ పాత్రలో ఇరికించారు. ఇప్పుడు పార్ట్-2లో నటించాల్సిన బాధ్యత నాపై పడింది.

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన కుమారుడు దుల్కర్ సల్మాన్ నిర్మించిన సూపర్ హీరో చిత్రం ‘లోక చాప్టర్ 1: చంద్ర’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో ‘మూతోన్’ అనే పవర్‌ఫుల్ పాత్రకు మమ్ముట్టి కేవలం వాయిస్ మాత్రమే ఇచ్చారు. అయితే, ఆ వాయిస్ వెనుక పెద్ద కథే ఉందని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తన ప్రమేయం గురించి మమ్ముట్టి మాట్లాడుతూ.. "నిజానికి నేను ఇందులో ఉన్నానని నాకు మొదట చెప్పలేదు. దుల్కర్ స్వయంగా రాకుండా, తన మేనేజర్‌ను పంపి వాయిస్ ఇమ్మని అడిగారు. నేను కేవలం వద్దు అని ఒక డైలాగ్ మాత్రమే చెప్పాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే.. అందులో ఉన్నది నేనేనని, ఆ చేయి కూడా నాదేనని ప్రకటించారు. నన్ను ఒక రకంగా మోసం చేసి ఆ పాత్రలో ఇరికించారు. ఇప్పుడు పార్ట్-2లో నటించాల్సిన బాధ్యత నాపై పడింది" అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
ఇక రెండో భాగంలో నటించాలంటే మమ్ముట్టిని ఒప్పించడం కష్టమని దుల్కర్ గతంలో అన్న మాటలకు ఆయన స్పందిస్తూ.. "నన్ను ఒప్పించడం కాదు, ముందు నేను అడిగే రెమ్యూనరేషన్ విషయంలో వాళ్లు ఒప్పందం కుదుర్చుకోవాలి. అది కుదిరితేనే ఏదైనా" అంటూ చమత్కరించారు. అలాగే తాను ఒక ‘వాంపైర్’ పాత్రలో కనిపిస్తానా? అన్న ప్రశ్నకు ఇన్షా అల్లాహ్ అంటూ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. కళ్యాణి ప్రియదర్శన్ ‘చంద్ర’ (యక్షి) పాత్రలో మెప్పించిన ఈ సినిమాలో నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్ ‘ఒడియన్’గా అతిథి పాత్రలో మెరిశారు. ఇక రెండో భాగంలో టొవినో థామస్ ‘మైఖేల్’ అనే ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన ఈ చిత్ర సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






