నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో నాకే తెలీదు.. మా అమ్మను అడగాలంటున్న హీరో..!

by  |

దిశ, వెబ్‌డెస్క్ : సినీ ఇండస్ట్రీలో హీరోల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంటుందో సాధారణ ప్రజలు గెస్ చేయలేరు. ఎందుకంటే వారి రెమ్యూనరేషన్ కాలికులేషన్స్ ఎప్పుడూ మారుతుంటాయి. తెలుగు చిత్ర పరిశమ్రలో ఒకటి రెండు హిట్స్ పడిన హీరో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేస్తాడు. అలాంటి వారు ఇండస్ట్రీలో తమ మార్కెట్.. అనగా తాము నటించిన మూవీస్‌కు ఎంత కలెక్షన్స్ వస్తున్నాయో బేరీజు వేసుకుని రెమ్యూనరేషన్ డిసైడ్ చేసుకుంటారు. ఒక్క సినిమాకు రూ.కోట్లలోనే ఉంటుంది వారి పారితోషికం. అదే బాలీవుడ్ అయితే తెలుగు ఇండస్ట్రీ హీరోల కంటే రెండు రెట్లు ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారు అక్కడి హీరోలు.. ఇక బడా హీరోలు సల్మాన్, షారుక్, సల్మాన్ లాంటి వారు ఏకంగా రూ.30cr నుంచి 50cr తీసుకుంటారని టాక్.. వీరు ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తుంటారు. అలా వీరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పడం చాలా కష్టం..

తాజాగా ఓ కుర్రహీరో తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమాలు వరుసగా చేస్తూ బిజీగా మారిపోయాడు. అతనెవరో కాదు బాలీవుడ్ హీరో ‘కార్తీక్ ఆర్యన్’.. ఈ కుర్ర హీరో తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఈ హీరో.. ‘నా బ్యాంకు ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో నాకే తెలీదని.. అలాంటివి తన తల్లి చూసుకుంటుందని తెలివిగా సమాధానం ఇచ్చాడు’. ఇక తన పెట్టుబడులు కూడా పట్టించుకోనని చెప్పాడు. తాను ఒక దుస్తులపై మాత్రమే ఎక్కువగా ఖర్చు చేస్తానని, ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పుకొచ్చాడు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed