‘రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరును వదలను’

by  |
‘రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరును వదలను’
X

దిశ, స్పోర్ట్స్: ‘గత 12 ఏళ్లుగా నేను బెంగళూరు (Royal Challengers Bangalore ) జట్టుకు ఆడుతున్నాను. ఆ జట్టుతో ప్రయాణం నాకు ఎప్పుడూ అద్భుతంగానే ఉన్నది. నేను ఎప్పుడూ ఆ జట్టును వీడిపోదామని అనుకోలేదు’ అని ఆర్సీబీ (RCB) కెప్టెన్ విరాట్ కొహ్లీ అన్నాడు. ఎన్నో సీజన్లుగా జట్టును నడిపిస్తున్న కొహ్లీ ఇప్పటి వరకు టైటిల్ గెలవక పోవడంపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొహ్లీ ఒక వీడియోను ట్విట్టర్‌లో పెట్టాడు. ‘కరోనా కారణంగా ఈ సీజన్ సక్రమంగా జరుగుతుందో లేదో అని అందరూ అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇది కచ్చితంగా, సక్రమంగా జరుగుతుంది. బెంగళూరు జట్టు తప్పకుండా ఈ సారి రాణిస్తుంది’ అని కొహ్లీ పేర్కొన్నాడు. బెంగళూరు జట్టును ఇప్పటికే కాదు ఎప్పటికీ వీడను అని కొహ్లీ అన్నాడు.



Next Story

Most Viewed