నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను: డిప్యూటీ సీఎం

by Vemula.Srinu Prasad |

<p>ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిఘీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, వారిలో చాలా మంది వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదని, కావాలనే వారు అలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ముస్లిం సామాజిక వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. డిప్యూటీ సీఎం రాష్ట్రంలో మత విద్వేషాలు రేకెత్తించే ప్రయత్నంలో ఉన్నారంటూ ఆరోపించారు. దీంతో ఆయన నష్ట నివారణ [&hellip;]</p>

నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను: డిప్యూటీ సీఎం
X

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిఘీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, వారిలో చాలా మంది వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదని, కావాలనే వారు అలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కే.నారాయణస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ముస్లిం సామాజిక వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. డిప్యూటీ సీఎం రాష్ట్రంలో మత విద్వేషాలు రేకెత్తించే ప్రయత్నంలో ఉన్నారంటూ ఆరోపించారు.

దీంతో ఆయన నష్ట నివారణ చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారిని శాంతిపజేసే ప్రయత్నం చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. అందులో “కరోనా మహమ్మారి నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు మరియు వారితో కలిసి మెలిగినవారు పరీక్షలు చేయించుకుని, వైద్యం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో నా మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుంటున్నాను” అని వ్యాఖ్యానించారు.

Tags: narayana swamy, ysrcp, deputy cm, ysrcp mla, twitter

Next Story