HYD నుంచి నాసిక్‌కు విమానం

by  |
HYD నుంచి నాసిక్‌కు విమానం
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోదావరి జన్మస్థలం నాసిక్‌కు విమాన సర్వీసులను నడిపేందుకు స్పైస్‌జెట్ సంస్థ ముందుకు వచ్చింది.ఈ నెల 20 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి ఉదయం 10.35కు బయలుదేరి మధ్యాహ్నం 12.5గంటలకు నాసిక్ కు చేరుకుంటుంది.

అదేవిధంగా అక్కడి నుంచి మధ్యాహ్నం బయలుదేరి.. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2.10గంటలకు ల్యాండ్ అవుతుంది. ఇదిలాఉండగా, హైదరాబాద్ నుంచి నాసిక్ కు టికెట్ ధర రూ. 3160గా ఉండగా.. నాసిక్ నుంచి హైదరాబాద్‌కు రూ.3385గా నిర్ణయించారు.

Next Story

Most Viewed