- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ నిమజ్జనం స్పెషల్.. హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా నేడు(ఆదివారం) గణపతి నిమజ్జనాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ గణేషుడు శోభయాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో ఈ నిమజ్జనోత్సవాలు చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అంతేగాకుండా.. హైదరాబాద్ మెట్రో సైతం ప్రత్యేక సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం మెట్రో రైలు సర్వీసులు పొడిగిస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా నేడు(ఆదివారం) గణపతి నిమజ్జనాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ గణేషుడు శోభయాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో ఈ నిమజ్జనోత్సవాలు చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అంతేగాకుండా.. హైదరాబాద్ మెట్రో సైతం ప్రత్యేక సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం మెట్రో రైలు సర్వీసులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు.
Next Story






